Gold price(19-02): పెరుగుతున్న బంగారం ధరలు.! 1 y ago
19-02: ఇటీవల కాలంలో స్థిర ఆదాయం కోసం పెట్టుబడిదారులు కమోడిటీ మార్కెట్లపై దృష్టి పెడుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. బుధవారం హైదరాబాద్, విజయవాడ, గుంటూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,350 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,650 కు చేరింది. నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల 22 క్యారెట్లపై రూ.650, 24 క్యారెట్లపై రూ.700 పెరిగాయి. కేజీ వెండి ధర రూ.1,08,000 వద్ద స్థిరంగా ఉంది.